BREAKING : రైలు ప్రమాద సంఘటన దగ్గరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ వెళ్లనున్నారు. విజయనగరం జిల్లాలో కంటాకపల్లి వద్ద రైలు ప్రమాద ఘటనాస్థలాన్ని సందర్శించనున్నారు ముఖ్యమంత్రి వైయస్. జగన్. 11.30 కు ముఖ్యమంత్రి జగన్ సంఘటన స్థలానికి బయలుదేరనున్నారు. ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న క్షతగాత్రులనూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు.
ఈ తరుణంలోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. విజయనగరం సమీపంలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనపై సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రైలు ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశాలు జారీచేశారు. మృతుల్లో రూ.10 లక్షలు ఏపీకి చెందిన వారికి, రూ.2 లక్షలు తీవ్రంగా గాయపడ్డవారికి సహాయం అందించాలన్నారు. అలాగే మరణించిన వారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉంటే వారికి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడ్డవారికి రూ 50వేల చొప్పున సహాయం అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.