ఏపీలో ఇళ్లు కట్టుకునే వారికి జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. తాము మంజూరు చేసిన ఇళ్లను సొంతంగా నిర్మించుకునే వారికే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి పావలా వడ్డీకే రుణాలు మంజూరు చేయిస్తోంది. ఒక్క ఇంటికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు ఇస్తుండగా…. అదనంగా రూ. 35వేల రుణం మంజూరు చేయిస్తోంది.
16 లక్షల మంది సొంతంగా ఇల్లు కట్టుకుంటుండగా…. వీరిలో 12.61 లక్షల మందికి రుణాలు మంజూరయ్యాయి. అటు SKLM, NTR, CTR, NLR, VSKP జిల్లాలపై ప్రభుత్వం మరింత ఫోకస్ పెట్టింది. ఇక అటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జిపిఎస్ (గ్యారంటీడ్ పింఛన్ స్కీమ్)ను ఆర్టిసి ఉద్యోగులకు అమలు చేస్తామని APSRTC డైరెక్టర్ ఏ.రాజారెడ్డి తెలిపారు. ‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక కార్మికులందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. త్వరలో వారికి జిపిఎస్ ను అమలులోకి తీసుకువస్తాం’ అని ఆయన స్పష్టం చేశారు. కాగా, OPS తరహాలో GPS లోను ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోన్న విషయం తెలిసిందే.