HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. చంచల్ గూడ జైలు నుంచి HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ రిలీజ్ అయ్యారు. నాంపల్లి ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు మంజూరు చేసింది.
ఇక ఈ రోజు ఉదయం 8 గంటలకు జైలు నుంచి విడుదలయ్యారు శివ బాలకృష్ణ, శివ నవీన్ కుమార్. అయితే…. దేశం విడిచి వెళ్లొద్దంటూ ఆదేశాలు ఇచ్చింది నాంపల్లి ఏసీబీ కోర్టు. ఏసీబీ విచారణకు సహకరించాలని నాంపల్లి ఏసీబీ కోర్టు తెలిపిన, షరతులతో కూడిన బెయిల్ HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు మంజూరు చేసింది.