Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మహేశ్ బాబు స్పైడర్ చిత్రంలో తెలుగులో ఓ క్లయిమాక్స్, తమిళంలో ఓ క్లయిమాక్స్ ఉంటాయన్న పుకార్లను ఖండించాడు ఆ సినిమా డైరెక్టర్ మురుగదాస్. క్లైమాక్స్ ను అలా రెండు పద్ధతుల్లో మార్చే ఆలోచన లేదని, రెండు భాషల్లోనూ ఒకే క్లయిమాక్స్ ఉంటుందని చెప్పారు.. ఒక్క పాట మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని తెలిపారు. ఆ ఒక్కపాటను ఈ నెల 25 నుంచి రొమేనియాలో చిత్రీకరిస్తామన్నారు మురుగదాస్.
స్పైడర్ సెప్టెంబరు 27న దసరా కానుకగా తెలుగు ప్రేక్షకుల మందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ రిలీజ్ చేయనున్నారు. తెలుగు, తమిళ భాషల షూటింగ్ ఒకేసారి చేస్తున్నారు. ఈ రెండు భాషలతో పాటు స్పైడర్ ను మళయాళం, హిందీ, అరబిక్ భాషల్లో డబ్ చేసి విడుదల చేయనున్నారు.
ఇటీవల సినిమాలోని బూమ్, బూమ్ పాట విడుదలైంది. ఈ పాట మహేష్ బాబు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. త్వరలోనే ఈ సినిమాలోని పుచ్చకాయ, పుచ్చకాయ అనే సాంగ్ కూడా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. సరైనోడు టైటిల్ సాంగ్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్రిజేశ్ శాండల్య పుచ్చకాయ పాటను పాడారు. ఈ పాట అరబిక్ లిరిక్స్ తో వెరైటీగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. తమిళ దర్శకుడు ఎస్.జె. సూర్య విలన్ పాత్రలో నటిస్తున్నారు.
మరిన్ని వార్తలు:
‘బాహుబలి’తో చైతూ ‘యుద్దం శరణం’కు సంబంధం ఏంటి?