అక్కను కాపాడబోయి ప్రేమోన్మాది చేతిలో తమ్ముడు హతం

అక్కను కాపాడబోయి ప్రేమోన్మాది చేతిలో తమ్ముడు హతం
Brutal death in hyderabad

25 ఏళ్ల ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ జి. పృధ్వి గౌడ్ హోమియోపతి చేస్తున్న తన అక్క జి సంఘవిని రక్షించే ప్రయత్నం లో హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం ఎల్‌బి నగర్‌లో చోటుచేసుకుంది.

ఆదివారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా కొందుర్గ్‌కు చెందిన అక్క తమ్ముడు ఎల్‌బీనగర్‌ పోలీస్‌ పరిధిలోని ఆర్టీసీ కాలనీలోని ఓ భవనంలోని మొదటి అంతస్తులో అద్దెకు ఉంటున్నారు. అదే గ్రామానికి చెందిన శివ అనే వ్యక్తి ఫ్లాట్‌లోకి చొరబడి సంఘవితో వాగ్వాదానికి దిగాడు.

వాగ్వాదం ముదరడంతో, శివ వంటగదిలో ఉన్న కత్తిని తీసుకున్నాడు. భయంతో సంఘవి బెడ్‌రూమ్‌లోకి పరుగులు తీసింది. తలుపు గాడి పెట్టుకొని గట్టిగ అరవడం మొదలుపెట్టింది. అరుపులు విన్న పృధ్వీ ఆమెను రక్షించేందుకు వచ్చాడు. దంతో శివ అతని ఛాతీపై కత్తితో పొడిచాడు. కత్తి గాయాలతో పృధ్వీ సహాయం కోసం బయటకు పరుగెత్తాడు. సంఘవి గదిలోంచి బయటకు రాగానే శివ కత్తితో ఆమెపై దాడి చేసాడు. పృధ్వీ రోడ్డుపైకి వెళ్లి కుప్పకూలిపోగా, స్థానికులు శివను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

అక్కను కాపాడబోయి ప్రేమోన్మాది చేతిలో తమ్ముడు హతం
G. Prudhvi Goud

కత్తిపోట్లకు పృధ్వి ఊపిరితిత్తులు దెబ్బతినడంతో అక్కడికక్కడే మృతి చెందగా, పలుచోట్ల కత్తితో గాయపడిన సంఘవి ప్రాణాపాయం నుంచి బయటపడింది.

కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎల్బీ నగర్ డీసీపీ బి.సాయిశ్రీ తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందని ఆమె తెలిపారు.