ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. అదేమంటే.. అన్న అని కూడా చూడకుండా ప్రతాప్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న చెల్లెలు.. భర్తని చంపేందుకు ప్లాన్ వేసింది. మానవ సంబంధాలు రోజురోజుకూ దిగజారి పోతున్నాయి. పడక సుఖం కోసం కొందరు పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. కట్టుకున్న వాళ్లనే దారుణంగా ఖతం చేస్తున్నారు. వావీవరసలు మరచిపోయి అన్నతోనే అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ యువతి ఆ బంధానికే మచ్చ తెచ్చింది. కామంతో రెచ్చిపోయి అన్నాచెల్లెళ్లు ఇద్దరూ కలిసి భర్తను అడ్డు తొలగించేందుకు పక్కా వ్యూహాన్ని రచించారు. భర్త నిద్రపోతున్న సమయంలో గొంతుకోసి అతికిరాతకంగా హత్య చేశారు. ఇంతటి దారుణమైన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది.