తన అక్కను చంపాడన్న అనుమానంతో బావను హత్య చేసి గోనె సంచిలో మూట కట్టి కాలువలో పడేసిన ఘటన భీమవరంలో చోటు చేసుకుంది. భీమవరం పోలీసుల కథనం ప్రకారం మామిడిశెట్టి నరసింహమూర్తి ఆర్ఎంపీ వైద్యుడిగా పని చేస్తున్నాడు. అతని మొదటి భార్య రాజరాజేశ్వరి అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు వారం రోజులుగా వెతుకుతున్నారు. రెండో భార్యతో కలసి ఉంటున్న బావను అక్కను వెతకడానికి రావాలని కోరిన బావమరుదులు లక్ష్మీనారాయణ, నరసింహం కారులో బయలుదేరారు. అక్కను బావే చంపేశాడని అనుమానించిన వారు మరో ముగ్గురితో కలసి బావను చంపి గోనెసంచిలో మూట కట్టి బిక్కవోలు కెనాల్ రోడ్డులో సున్నపు బట్టీల వద్ద కాలువలో పడేశారు.