విద్యార్థిని ఆత్మహత్య

విద్యార్థిని ఆత్మహత్య

బాచుపల్లిలో కళాశాల వసతిగృహంలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వసతిగృహం 13వ అంతస్తు నుంచి దూకి శివనాగులు అనే బీటెక్‌ విద్యార్ధి గురువారం బలవన్మరనానికి పాల్పడింది. శివ నాగులు ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.అయితే జీవితంపై విరక్తితోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు విద్యార్ధిని లేఖలో పేర్కొంది. విద్యార్ధిని రాసిన సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చ్సేతున్నారు.