బంగ్లాదేశ్ మరియు సౌత్ ఆఫ్రికా లమధ్యన జరుగుతున్న మ్యాచ్ లో మరో భారీ విజయానికి సఫారీలు బలమైన పునాది వేసుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 50 ఓవర్లకు గాను 382 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ 383 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆటగాళ్లు కుదేలయ్యారు. క్రీజులో నిలబడడానికి ఇబ్బంది పడుతున్నారు, సౌత్ ఆఫ్రికా లిట్ వరల్డ్ క్లాస్ బౌలింగ్ లైన్ అప్ ను ఎదుర్కోవాలంటే అంత ఈజీ కాదని తెలిసిందే. అయినా వికెట్లు కూడా కాపాడుకోలేక స్వల్ప స్కోర్ కె సగం వికెట్లు కొలిపోయి ఓటమికి దగ్గరగా ఉంది. టాంజిద్ హాసన్ (12), లిటన్ దాస్ (22), శాంటో (0), రహీం (8), షకీబ్ (1) లు అవుట్ అయ్యారు.
కేవలం 5 కీలక వికెట్లు 58 పరుగులకే కోల్పోయి ఓటమికి చేరువలో ఉంది. మరోసారి సౌత్ ఆఫ్రికా కు మారక జాన్సన్ అద్భుతంగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఓడిపోతే ఇక సెమీస్ అవకాశాలు లేనట్లే.. అనధికారికంగా సెమీస్ కు దూరం అవుతుంది.. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్ లలో ఒక్క విజయం మాత్రమే దక్కింది.