హైదరాబాద్ మహానగరంలో ఈరోజు ఉదయం నుండి బస్సులు బంద్ అవడం ప్రజలకి ఇబ్బందిగా మారింది. అసలు ఎందుకో బంద్ అయ్యిందో కూడా సామాన్య ప్రజానీకానికి తెలియకపోవడం కొసమెరుపు. అయితే అది మోటారు వాహనాల సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఒక రోజు ప్రజా రవాణా సంస్థల బంద్ లో భాగంగా హైదరాబాద్ లో ఆర్టీసీ కార్మిక సంఘాలు బంద్ కు మద్దతు ప్రకటించాయి. దీంతో నగరం మొత్తం మీద బస్సులు బంద్ అయ్యాయి.
దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే ఆటో సంఘాలు సైతం బంద్లో పాల్గొనాలని భావించినా నగరంలో కొన్ని చోట్లా మాత్రం తిరుగుతున్నాయి. దీంతో ఈ రోజు సిటీ బస్సులతో పాటు ఊర్లకి వెళ్ళే బస్సు సర్వీసులు సైతం డుమ్మా కొట్టనున్నాయి. ఉదయం లేచింది మొదలు సాయంత్రం ఇంటికి చేరే వరకూ ఆర్టీసీ బస్సులు ఆటోలలో ప్రయణం చేసే వారికి ఈ బంద్ కారణంగా ఇబ్బంది ఎదురు కానుంది.