టిడిపికి ఉభయ గోదావరి జిల్లాలలో మంచి పట్టు ఉంది అన్నది వాస్తవం. ఇప్పుడు టిడిపి , జనసేన పొత్తు నేపథ్యంలో ఈ బలం మరింత బలపడి ఉభయగోదావరి జిల్లాలోని అన్ని స్థానాలను టిడిపి జనసేన పొత్తులో గెలుచుకున్న ఆశ్చర్యపోవక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నరసాపురం, తాడేపల్లిగూడెం, రామచంద్రాపురం, కాకినాడ, పిఠాపురం వంటి వాటిలో 20 నియోజకవర్గాలలో టిడిపి, జనసేన కచ్చితంగా గెలిచి తీరుతాయి అని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఈ నియోజకవర్గాలలో ఏకపక్ష ఫలితమే. టిడిపి నేతలు ఎదురు నిలిచిన వారికి డిపాజిట్లు కూడా దక్కవని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అటు ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కు అభిమానులు ఎక్కువగా ఉన్నారు. జనసేన కార్యకర్తలు, సొంత సామాజిక వర్గం ఓట్లు కూడా పవన్ కి ఉన్న బలం. అలాగే టిడిపికి కూడా గోదావరి జిల్లాలలో మంచి పట్టు ఉంది. ఇప్పుడు ఈ రెండు అంశాలు టిడిపి, జనసేన పొత్తు ఖచ్చితంగా విజయం సాధిస్తుందని అంచనా.
కానీ ఉభయ గోదావరి జిల్లాలలో కాపు ఓట్లకి సమానంగా బీసీ ఓట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు టిడిపి, జనసేన వారికి పోటీగా బీసీ అభ్యర్థిని నిలబెట్టి చెక్ పెట్టాలని ఆలోచనలో జగన్ ఉన్నారని రాజకీయ వర్గాలు అంటున్నారు. అప్పుడు బిసిల ఓట్లు ఏకపక్షం అయ్యి..వైసీపీకి ప్లస్ అవుతుందని ప్లాన్. మరి జగన్ వ్యూహం ఫలిస్తుందా? బీసీలతో కాపు ఓట్లకు చెక్ పెట్టగలరా? వైసీపీ వ్యూహాన్ని జయించి టిడిపి, జనసేన గెలిచి తీరతాయా? వేచి చూడాల్సిందే