Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఓ వైపు అమెరికా పొమ్మంటోంది…ఇంకోవైపు ఆస్ట్రేలియా రావద్దంటోంది.ఇక బ్రిటన్ నో చెప్పేస్తోంది.ఈ దేశాల నిర్ణయాల ప్రభావంతో ఇండియన్ ఐటీ కంపెనీలు గడగడలాడుతున్నాయి. వణుకుతోంది కంపనీలేగానీ ఊడిపోయేది మాత్రం ఉద్యోగుల ఉపాధి అని వేరే చెప్పక్కర్లేదు. ఈ పరిణామాలు భారతీయ ఐటీ నిపుణుల్ని తీవ్ర అభద్రతకు గురి చేస్తున్నాయి.అలాంటి టైం లో వారికోసం ఓ గుడ్ న్యూస్ . ఓ దేశం తమకి ఐటీ నిపుణులు కావాలి రా రమ్మంటోంది..అదే కెనడా.
కెనడా లో ఐటీ రంగం ఇప్పుడిప్పుడే ఊపు అందుకుంటోంది.2021 నాటికి ఆ దేశానికి రెండు లక్షల పాతిక వేల మంది ఐటీ ఉద్యోగులు అవసరం అవుతారని ఓ అంచనా. అంతంత మాత్రం మానవ వనరులున్న ఆ దేశం ప్రతిభ వున్న విదేశీ ఐటీ నిపుణులకు స్వాగతం పలుకుతోంది.ఇప్పటికే ఆ దేశంలో దాదాపు 13 ,14 లక్షల మంది ఐటీ రంగంలో పని చేస్తున్నారు.అయితే చాలినంత మంది నిపుణులు లేక కొన్ని ప్రాజెక్ట్స్ విషయంలో కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయి.మరీ ముఖ్యంగా డేటా అనలిస్ట్స్,డేటా అడ్మినిస్ట్రేటర్స్,ప్రోగ్రామర్లు,టెస్టర్లకి మంచి అవకాశాలు కెనడాలో వున్నాయి.ఇక ఐటీ కాకుండా మరికొన్ని ప్రింటింగ్ టెక్నాలజీ లాంటి రంగాల్లో అపార అవకాశాలు కెనడాలో వేచి చూస్తున్నాయి. అందుకోండి…ఆ అవకాశం ..ఇంకెందుకు ఆలస్యం?