కరోనా కాలంలో లాక్ డౌన్ సడలింపుల కారణంగా దేశంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. ప్రజలు మళ్లీ రోడ్డెక్కడంతో రవాణా సమయంలో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నయి. జార్ఖండ్‌లో మంగళవారం తెల్లవారుజామున 5:30 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధన్‌బాద్ జిల్లా గోవింద్‌పుర్ బర్వాలో ఖుడియా నది బ్రిడ్జి పైనుంచి వెళ్తున్న కారు అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.