ఏమాత్రం తగ్గని కారు జోరు…క్లీన్ స్వీప్

car speed does not changed

తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కారు జోరు చూపింది. ఉమ్మడి రంగారెడ్డి, వరంగల్,  నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడింటికి మూడు స్థానాలను గెలిచి సత్తాచాటింది.  ఉమ్మడి రంగారెడ్డి ఎమ్మెల్సీగా మాజీ మహేందర్ రెడ్డి,  ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఎమ్మెల్సీగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్సీగా తేరా చిన్నపరెడ్డి విజయం సాధించారు. ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలకు మే31 ఎన్నికలు జరిగగా వరంగల్‌ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో  టీఆర్ఎస్ తరపున పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా ఇనుగాల వెంకట్రామిరెడ్డి బరిలో ఉన్నారు.  శ్రీనివాస్‌కు  850 ఓట్లు పోలయ్యాయి.  వెంకట్రామిరెడ్డి 23 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.  నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డి, కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి లక్ష్మి పోటీ చేశారు.  టీఆర్ఎస్ అభ్యర్థికి 640 ఓట్లు పోలవగా.. కాంగ్రెస్ అభ్యర్థికి 433 ఓట్లు మాత్రమే పడ్డాయి. రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో  టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పోటీచేయగా మహేందర్ రెడ్డి విజయం సాధించారు. 244 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థులను సీఎం కేసీఆర్ అభినందించారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు ఏకపక్ష‌ విజయాన్ని అందించిన స్థానిక సంస్థల ప్రతినిధులకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.