ప్రపంచమంతా కరోనా వైరస్ తో యుద్ధం చేస్తుంటే.. మరికొంతమంది మూఢ నమ్మకాలలో మునిగిపోయి అందులోంచి బయటకు రాలేకపోతున్నారు. ఈ కరోనా మహహమ్మారిని నయం చేసే వ్యాక్సిన్ తయారీ కోసం సైంటిస్టులు, పరిశోధకులు రేయింబవళ్లు కష్టపడుతుంటే.. మూఢనమ్మకాలతో నాటు వైద్యంతో కరోనాను పారదోలతామంటూ ఇంకా భ్రమల్లోనే బ్రతుకుతుంది లోకం.
అయితే తాజాగా ఓ అర్చకుడు కరోనా వైరస్ పీడ పోవాలని నరబలి ఇచ్చిన ఘటన సర్వత్రా కలకలం రేపుతోంది. ఈ దారుణ సంఘటన ఒరిస్సా రాష్ట్రంలో వెలుగు చూసింది. కటక్ జిల్లా నర్సింగ్ పూర్ లో బ్రాహ్మణిదేవి ఆలయంలో నరబలి ఇచ్చారు. కరోనా నుంచి ప్రజలకు విముక్తి కలగాలని ఆలయ అర్చకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన తెలిసి ప్రజలు తీవ్ర భయల భ్రాంతులకు గురయ్యారు. మొత్తానికి అది అంతా అందరికీ గుప్పుమనండంతో అర్చకుడు సంసారి హోజాను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు.