చైనాలో ఇంకా తగ్గని కరోనా మృతుల సంఖ్య

చైనాలో ఇంకా తగ్గని కరోనా మృతుల సంఖ్య

కొత్తగా 409 మందిలో కరోనా గుర్తించినట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ వెల్లడించింది. మొత్తం బాధితుల సంఖ్య 77,150కి చేరినట్టయ్యింది. తాజా మృతుల్లో ఒక్కరు మినహా మిగతా అందరూ హుబెయ్‌ ప్రావిన్స్‌కు చెందినవారే. అటు దక్షిణ కొరియాలోనూ వైరస్ కారణంగా ఏడుగురు మృత్యువాతపడ్డారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 2,619కి చేరింది. ఇక్కడ కొత్తగా మరో 235 మంది నమూనాల్లో కరోనా వైరస్ ఉన్నట్టు తేలడంత బాధితుల సంఖ్య 833కి చేరుకున్నట్టు అధికారులు తెలిపారు.

అటు, వుహాన్‌‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నిపుణుల బృందం పర్యటన కొనసాగుతోంది. నగరంలోని ఆసుపత్రులను సందర్శించి, బాధితులతో మాట్లాడి వైరస్‌ తాజా పరిస్థితిని ఈ బృందం పరిశీలిస్తోంది. హుబే ప్రావిన్సుల్లో 25,076 మంది కోలుకున్నారని, మరో 11వేల మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వెల్లడించారు. హాస్పిటల్స్‌లో ఉన్న బాధితుల్లో 40 వేల మంది పరిస్థితి సాధారణంగా ఉన్నట్టు అధికారులు తెలియజేశారు. వైరస్‌ లేదని నిర్ధారణ అయిన విదేశీయులు వుహాన్‌ నగరం నుంచి వెళ్లిపోయేందుకు చైనా అధికారులు అనుమతినిచ్చారు.