‘దర్బార్’ మూవీని నిలిపివేయాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు

‘దర్బార్’ మూవీని నిలిపివేయాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న ‘దర్భార్’ మూవీకి మొదటి నుంచి రక రకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ రజినీకాంత్, నయనతార జంటగా నటిస్తున్నారు. ఈ మూవీలో చాలా కాలం తర్వాత రజినీ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య జ‌న‌వ‌రి 9న విడుద‌ల‌య్యేందుకు సిద్ధ‌మైన మూవీ ద‌ర్భార్. ఈ మూవీలో నివేదా థామస్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీకి మరో సమస్య వచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

గతంలో కూడా రజినీకాంత్ నటిస్తున్న మూవీస్ పై ఎన్నో రకాల అభ్యంతరాలు.. రూమర్లు పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు ‘దర్బార్’ మూవీని నిలిపివేయాలంటూ మలేషియాకు చెందిన డీఎమ్‌వై క్రియేషన్స్ సంస్థ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గతంలో స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 2.0 మూవి విషయంలో ఫైనాన్స్ ఇష్యూ ఇప్పుడు తెరపైకి వచ్చింది. 2.0, ద‌ర్భార్ సినిమాల నిర్మాణ స‌మ‌యంలో మా సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌కి ఫైనాన్స్ ఇవ్వ‌గా వారు ఇంకా రూ. 23 కోట్ల బ‌కాయిలు చెల్లించాల‌ని డీఎమ్‌వై క్రియేషన్స్ సంస్థ పేర్కొంది.

కాగా, దీనిపై వెంటనే విచార‌ణ జరిపించిన కోర్టు ద‌ర్భార్ సినిమా విడుద‌ల కావాలంటే లైకా సంస్థ డీఎమ్ వై క్రియేష‌న్స్ సంస్థ‌కి రూ. 4.90 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఇప్పటికే పలు విషయాల్లో ఇబ్బందులు పడుతూ వచ్చిన దర్భార్ మూవీ రిలీజ్ సమయంలో ఈ సమస్యను లైకా సంస్థ వారు ఎలా పరిష్కరించుకుంటారు అన్న తెలియాల్సి ఉంది. మరోవైపు రజినీ ఫ్యాన్స్ ఈ మూవీ రిలీజ్ కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు.