లియో చిత్ర బృందం మరియు హీరో విజయ్ పైన కేసు

లియో చిత్ర బృందం మరియు హీరో విజయ్ పైన కేసు
లియో

తమిళ స్టార్ హీరో విజయ్ పై కేసు నమోదు అయినట్టు సమాచారం అందుతుంది. తాజాగా విజయ్ నటిస్తున్న మూవీ లియో సినిమా నుండి రీసెంట్ గ “నా రెడీ…”మొదటి సాంగ్ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియోలో మత్తు మందును ఎక్కువగా వినియోగిస్తున్న దృశ్యాలను చూపించడంతో ఒక సామజిక కార్యకర్త ఆన్లైన్ ద్వారా పోలీస్ కంప్లైంట్ చేసినట్టు తెలుస్తుంది.

ఈ కంప్లైంట్ ను ఆధారంగా తీసుకున్న పోలీసులు చిత్రయూనిట్ మరియు హీరో విజయ్ పైన కేసును నమోదు చేసారని తెలుస్తుంది . ఈ సినిమాను అక్టోబర్ లో విడుదల కానుంది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజన్ తెరకెక్కిస్తున్నారు . మరి ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది .