Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మాజీ కేంద్ర మంత్రి పి. అశోక్ గజపతి రాజు చిక్కుల్లో పడినట్లే నని కొన్ని జాతీయ మీడియాలో కొన్ని కధనాలు వచ్చాయి. 2015-16లో కొందరు పౌరవిమానయాన శాఖ అధికారులకు లంచాలు ఇచ్చిన కేసులో ఎయిర్ ఏషియా చీఫ్ ఎగ్జికూటివ్ ఆఫీసర్ టోనీ ఫెర్నాండెజ్ పై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ‘ఏపీ సీఎం చంద్రబాబుతో సఖ్యంగా ఉంటే ప్రతీదీ వస్తుంది’ అని ఇండియా ఎయిర్‌లైన్స్ సీఈవో మిట్టు శాండిల్యతో అన్నారని సీబీఐ విచారణలో వెలుగులోకి వచ్చిందని ఓ జాతీయ పత్రిక కథనాన్ని ప్రచురించింది. మిట్టూతో మాట్లాడిన ఈ విషయాలు అప్పట్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన టిడిపి ఎంపీ అశోక్ గజపతిరాజు ఉన్న సమయంలో ఈ ప్రస్తావన వచ్చిందట.
ఎయిర్ఆసియా ఇండియా లిమిటెడ్ (ఎఎఐఎల్) కు 2015-16లో అంతర్జాతీయ ఆపరేషన్స్ లైసెన్స్ లు పొందేందుకు ఫెర్నాండెజ్ గుర్తు తెలియన పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారులకు, ఇతరులకు లంచాలు ఇచ్చినట్లు సిబిఐ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను ఎయిర్ ఏషియా తిరస్కరించింది. అయితే ఇప్పటికే ప్రత్యేక హోదా విషయంలో మోడీ తమను మోసం చేసిందని చంద్రబాబు నేతృత్వంలోని తీదేపీ రెండు కేంద్రమంత్రి పదవులను సైతం తృణప్రాయంగా వదిలేసి వచ్చింది. అప్పటి వరకు చంద్రబాబు విషయంలో పల్లెత్తు మాట అనని బీజేపీ నాయకులూ ఇక చంద్రబాబుకు టైం దగ్గర పడిందని మే 15 తర్వాత చుక్కలు చూపిస్తామని పేర్కొన్న వారు ఇప్పుడు సిబీఐ దగ్గర ఉన్న ఆడియో టేప్ లలో చంద్రబాబు పేరు రావడంతో బీజీపీ ఈ విషయాన్నీ కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.