ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నారు పుటల్లోకి ఎక్కారు. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించిన తొలి తెలుగు వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ‘జీరో బడ్జెట్ నేచురల్ ఫామింగ్’పై ఆయన ఈరోజు ఉదయం కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబును ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు చాలా గొప్పగా పరిచయం చేశారు. వారి మాటల్లోనే (తెలుగు అనువాదం )
“ఎక్సలెన్సీస్, లేడీస్ అండ్ జెంటిల్మన్. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన విజేతలు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మనతో ఉన్నారు. ఇండియాలో చంద్రబాబు ఒక ఐకానిక్ లీడర్. ప్రపంచంలోని ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు భారతీయులే. ఇండియాలోని ప్రతి నలుగురు ఐటీ ఎక్స్ పర్ట్స్ లో ఒకరు చంద్రబాబు రాష్ట్రానికి చెందినవారే. భారతదేశ జనాభాలో చంద్రబాబు రాష్ట్ర జనాభా కేవలం నాలుగు శాతం మాత్రమే అయినా దేశ ఐటీ నిపుణుల్లో 25 శాతం మంది ఆయన రాష్ట్రం వారే.
ఐటీ రంగంలో ఆయన ఎంతో ప్రగతిని సాధించారు. మీ లీడర్ షిప్ కు, ఛాంపియన్ షిప్ కు ధన్యవాదాలు. మీ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు చాలా చేస్తున్నారు. ఏపీ, ఇండియా… వీలైతే ప్రపంచ భవిష్యత్తును మార్చగలరు. మీరు చేస్తున్నది వినాలనుకుంటున్నాం. మీరు మాతో ఉన్నందుకు ధన్యవాదాలు”… అంటూ చంద్రబాబును ఐక్యరాజ్యసమితి మోడరేటర్ ఈ విధంగా పరిచయం చేస్తున్నప్పుడు… సభాప్రాంగణం చప్పట్లతో మారుమోగింది.
And this is how @ncbn was introduced at the UN Session in New York#ZeroBudgetNaturalFarming#CBNatUN pic.twitter.com/VJwm4MFlG1
— Telugu Desam Party Official (@JaiTDP) September 25, 2018