మోదీ కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు సమాచారం.
దేశంలో 80 కోట్ల పేద వారికి ప్రత్యేక రేషన్ సరఫరా చేయనున్నట్లు మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.రెండు రూపాయలకే కిలో గోధుమలు,రూ.3కే కిలో బియ్యం సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. లాక్ డౌన్ చూసి ప్రజలు భయపడవద్దని కేంద్రమంత్రి ప్రకాష్ తెలియజేశారు.ప్రజలకు నిత్య అవసరాల సౌకర్యాలు అందుబాటులోనే ఉంటాయని… గుంపులుగా వచ్చి ఈ మహమ్మారిని వృద్ధి చేయద్దని ఆయన వెల్లడించారు.కేంద్ర రాష్ట్రం, ప్రభుత్వ రాష్ట్రంతో కలిసి పని చేస్తున్నట్లు తెలియజేశారు.ఫేక్ వార్తల పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని,త్వరలో అన్ని జిల్లాల వారిగా హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేయనున్నట్లు జావడేకర్ తెలియజేశారు.