పిల్లాడితో అమ్మాయి రొమాన్స్‌కు కేంద్రం బ్రేక్‌

central-government-ban-the-pehredaar-piya-ki-bollywood-serial

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

గత కొన్ని రోజులుగా జాతీయ మీడియాలో ఒక హిందీ సీరియల్‌ గురించి తెగ ప్రచారం జరుగుతుంది. 19 సంవత్సరాల యువతి కొన్ని కారణాల వల్ల 10 సంవత్సరాల బాలుడిని వివాహం చేసుకోవాల్సి వస్తుంది. సీరియల్‌ కావున ఇలాంటివి కామన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉందని అంతా భావించారు. ఇప్పుడు ఆ యువతి మరియు బాలుడి మద్య రొమాంటిక్‌ సన్నివేశాలను చూపించేందుకు సదరు సీరియల్‌ వారు సిద్దం అవుతున్నారు. ఇద్దరికి శోభనం, హనీమూన్‌ అంటూ హంగామా జరుగుతుంది. దాంతో కొందరు ప్రేక్షకులు ఈ విషయాన్ని తప్పుబట్టారు. కేంద్ర మంత్రికి పలువురు ఇటీవల ఈ సీరియల్‌పై ఫిర్యాదు చేయడం జరిగింది. 

కేంద్ర ప్రభుత్వం ఈ సీరియల్‌పై చర్యలకు సిద్దం అయ్యింది. ఆన్‌లైన్‌లో ఈ సీరియల్‌కు వ్యతిరేకంగా దాదాపు 10 వేల మంది సంతకాలు చేయడం జరిగింది. ప్రజల్లో వ్యక్తం అవుతున్న వ్యతిరేకత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ సీరియల్‌పై చర్చలు తీసుకోవాల్సిందిగా సమాచార శాఖను ఆదేశించడం జరిగింది. సీరియల్‌ నిర్మాతలకు మరియు సీరియల్‌ ప్రసారం అవుతున్న ఛానల్‌కు సమాచార శాఖ నోటీసులు జారీ చేయడం జరిగింది. మరి కొన్ని రోజుల్లోనే సీరియల్‌ ఆగిపోయే అవకాశాలున్నాయని, లేదా కథ మార్చే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. సీరియల్‌కు వ్యతిరేకంగా కొన్ని ప్రజా సంఘాలు చేసిన ఉద్యమం సక్సెస్‌ అయ్యింది. ముందు ముందు ఇలాంటి సీరియల్స్‌ రాకుండా ఇదో గుణపాఠంగా చెప్పుకోవచ్చు.

మరిన్ని వార్తలు:

సంజ‌య్ ద‌త్ పాత్ర‌లో న‌టించేందుకే నేను పుట్టాను

ఆనందో బ్రహ్మ… తెలుగు బులెట్ రివ్యూ.

మహేష్‌కు ఎందుకంత టెన్షన్‌?