Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత్ ఎలక్ట్రానిక్స్ పాలసీని సవరించే దిశగా కేంద్రం సీరియస్ గా ఆలోచిస్తోంది. చైనా మేడ్ వస్తువులు వెల్లువలా వచ్చిపడుతున్న తరుణంలో… వీటికి అడ్డుకట్ట వేయాలని సమగ్ర వ్యూహం రచిస్తోంది. సరిహద్దులో ఉధ్రిక్తతల మధ్య చైనా వస్తువులు విచ్చలవిడిగా వాడటం మంచిది కాదని సోషల్ మీడియాలో విపరీత ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు మోడీ సర్కారు కూడా చైనా వస్తువులపై సుంకాలు పెంచుతోంది.
మా దిగుమతులు రాకుంటే నష్టం మీకేనని చైనా రొమ్ము విరుచుకుని చెప్పడంతో… అసలు ఈ వ్యాఖ్యల మర్మమేంటా అని కేంద్రమంత్రులు లోతుగా సమీక్ష జరిపారు. పేరుకు ఎలక్ట్రానిక్స్ ఇండియాలో తయారవుతున్నా.. వాటి విడిభాగాలన్నీ చైనా నుంచే వస్తున్నాయి. పైగా మనం ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడల్లా మన సమాచారం చైనా సర్వర్లకు వెళ్లిపోతోంది.
ఇప్పటికే మెజార్టీ భారతీయుల ఇన్ఫర్మేషన్ చైనా దగ్గరుంది. ఇది చాలా డేంజరస్. తక్కువకు వస్తున్నాయి కదా అని చైనా వస్తువుల్ని ప్రోత్సహించిన ప్రభుత్వాలు ఇప్పుడు తీరిగ్గా తలపట్టుకుంటున్నాయి. గుజరాత్ సీఎంగా నరేంద్ర మోడీ కూడా చైనాను బాగానే ప్రమోట్ చేశారు. ఇప్పుడు కూడా చైనా అధ్యక్షుడికి అతి మర్యాద ఇచ్చారు. దూర్త దేశాల జాబితాలో పెట్టాల్సిన దేశాన్ని నెత్తిన పెట్టుకుంటే ఎప్పటికైనా ముప్పు తప్పదు.
మరిన్ని వార్తలు: