తెలంగాణ అంటే ఎగిరి గంతేస్తున్న ఐఏఎస్ లు

centre-allocates-ias-ips-and-ifos-officers-to-telangana

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

హైదరాబాద్ కు వచ్చినవాళ్లెవరూ తిరిగి స్వస్థలాలకు వెళ్లాలనుకోరు. అలాంటి వాతావరణం నగరానికి సొంతం. మొన్నటి వరకు ప్రభుత్వ పని ఒత్తిడి కారణంగా ఐఏఎస్ లు కేంద్ర సర్వీసులకు వెళ్తామని అప్లికేషన్లు పెట్టుకునేవాళ్లు. కానీ తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారింది. ఇంతవరకూ ఒక్క అధికారి కూడా ఢిల్లీ వెళ్తామని అడిగిందే లేదు. దీనికి తోడు ఏపీకి కేటాయించిన అధికారులతో పాటు ఢిల్లీ అధికారులు కూడా ఇక్కడికే వస్తామంటున్నారు.

వీళ్లంతా హైదరాబాద్ వాతావరణం కోసం మొగ్గుచూపడం లేదు. ఇక్కడి పాలన తీరు కూడా వారికి అనువుగా ఉంది. మంత్రులతో సమానంగా వాహన సదుపాయం, మంచి ప్రీమియమ్ క్వార్టర్స్ వంటి సౌకర్యాల కల్పన వాళ్లను తెలంగాణ వైపు ఆకర్షితులయ్యేలా చేస్తోంది. పైగా పథకాల అమలు తీరు పైస్థాయిలో సీఎంఓ, కింది స్థాయిలో కలెక్టర్లు చూస్తుండటంతో.. మధ్యలో అధికారులకు పని లేకుండా పోయింది.

అందుకే కమిషనర్లు, ముఖ్య కార్యదర్శుల పోస్టుల కోసం లాబీయింగ్ బాగా పెరిగింది. ఈ పదవి దక్కితే టెన్షన్ లేకుండా కాలం గడపొచ్చని అధికార వర్గాల్లో టాక్ ఉంది. దీనికి తోడు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అధికారులకు అండగా ఉంటున్నారని, పరిపాలనలో పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారనే పేరొచ్చింది. దీంతో ఎప్పుడూ లేని విధంగా ఢిల్లీ నుంచి తెలంగాణకు వస్తామని రిక్వెస్టులు వస్తున్నాయట.

మరిన్ని వార్తలు:

యానిమేటడ్ వీడియోతో భ‌య‌పెడుతున్న ఉత్త‌ర‌కొరియా

ట్రిపుల్ త‌లాక్ తీర్పుపై హ‌ర్షాతిరేకం