గత కొన్నల్లగా టీడీపీకి వరస షాక్ లు తగులుతుండగా ఇప్పుడు వైసీపీకి షాక్ తగలనుంది. సాధారణ ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ టీడీపీలో చేరనున్నారు. వచ్చే ఎన్నికల్లో కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేయనున్నారని సమాచారం అందుతోంది. గతంలో ఒకసారి ప్రజారాజ్యం నుండి మరోసారి వైసీపీ నుండి రెండుసార్లు ఇదే స్థానం నుంచి పోటీచేసిన సునీల్ త్రుటిలో ఓటమి చవిచూశారు. ప్రజారాజ్యం తరఫున పోటీచేసిన సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి పళ్లంరాజు చేతిలో 30 వేల ఓట్లతో ఓడిపోయారు. తర్వాత, 2014లో వైసీపీ తరఫున కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి, స్వల్ప ఓట్లతో ఓటమి చవిచూశారు.
ఎన్నికల జరిగిన పరిణామాల అనంతరం ఆయన వైసీపీకి దూరంగా ఉంటున్నారు. గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో చలమశెట్టి సునీల్ భేటీ కావాడంతో ఆయన ఆ పార్టీలో చేరుతారనే ప్రచారం జరిగింది. తాజాగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును అమరావతిలో చలమశెట్టి సునీల్ కలిసి మాట్లాడారు. దాంతో ఆయన టీడీపీలో చేరడం ఖాయమైనట్టు తెలుస్తోంది. గతంలో పవన్ తో సునీల్ భేటీ కావడంతో ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారనే అంశంపై కొంత సందిగ్ధత నెలకొంది. చివరకు ఆయన టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. మార్చి1న భారీ కాన్వాయ్‌తో అమరావతికి వచ్చి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరతారని టీడీపీ వర్గాలు తెలియజేశాయి.