వైసీపీ పాలన విధానం ఫై చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం

వైసీపీ పాలన విధానం ఫై చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం

వైసీపీ పాలన విధానం ఫై చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెల్సిందే. గడిచిన 9 నెలల్లోనే జగన్ అరాచక, అసమర్థ, అవినీతి పాలన గూర్చి ప్రజలకు తెలియజేసేందుకు ఈ ప్రజా చైతన్య యాత్ర అని చంద్రబాబు తెలియజేసిన సంగతి తెలిసిందే. మొత్తం 13 జిల్లాల్లో పర్యటించనున్న చంద్రబాబు దాదాపు 100 నియోజకవర్గాలకు పైగా సమస్యలని వివరించనున్నారు. అయితే చంద్రబాబు యాత్రలో చేస్తున్న తీరు ఫై విజయసాయి రెడ్డి స్పందించారు.

గట్టిగా చప్పట్లు కొట్టి తనని ఉత్సాహపరచాలని 70 ఏళ్ల వయసులో చంద్రబాబు ప్రాధేయపడుతుంటే జాలేస్తుంది అని వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. కార్యకర్తలు మరీ స్పందన లేకపోతె ఎలా? అడిగినందుకైనా కాసేపు క్లాప్స్ కొట్టొచ్చు కదా అంటూ సెటైర్లు వేశారు. చివరకు స్లొగన్స్ ఇచ్చి అందరు తనతోనే ఉన్నారని భ్రమపడి ఇంకోచోటుకి బయలుదేరుతున్నాడు అని సంచలన వ్యాఖ్యలు చేసారు.