ఈ చిత్రం కోసం ఆశగా చూస్తున్న అభిమానులు

ఈ చిత్రం కోసం ఆశగా చూస్తున్న అభిమానులు

ట్రిపుల్ ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ ఎలా ఉంటాడనే దానిపై ఇప్పుడు అందరికి ఒక ఐడియా ఉంది. ఈ చిత్రంలో చాల కీలకం అయినా పులి ఫైట్ బిట్ లీక్ అవడంతో ఎన్టీఆర్ ని అలా చుసిన ఫాన్స్ ఈ చిత్రం కోసం ఆశగా చూస్తున్నారు.

అయితే ఎన్టీఆర్ కనిపించేసాడు కానీ, రామరాజు పాత్ర చేస్తున్న రామ్ చరణ్ మాట ఏమిటి అతని పాత్ర ఎలా ఉండబోతోంది ఎన్టీఆర్ కి ఉన్నట్టే చరణ్ కి కూడా హీరోయిజం సీన్స్ ఉన్నాయా అసలు షూటింగ్ లో చక్కగా పాల్గొనని చరణ్ కి ఇందులో సరిపడా సన్నివేశాలు ఉన్నాయా చిరంజీవి కూడా ఈ చిత్రంలో చరణ్ పాత్ర నిడివి, ప్రాధాన్యత పట్ల ఆందోళనగా ఉన్నారనే పుకార్లు కూడా పుట్టించేసారు.

ఇదిలా ఉంటే చరణ్ వీడియో కూడా లీక్ చేయాలంటూ రాజమౌళిపై ఒత్తిడి పెరుగుతోంది. ఎన్టీఆర్ కి ఎలా అయితే ఎలివేషన్ వచ్చిందో చరణ్ కి కూడా అలా హెల్ప్ అయ్యే బిట్ లీక్ చేయాలనీ ఫాన్స్ స్వయంగా అడుగుతున్నారు. ఈ గోల మరీ ఎక్కువవుతోంది కనుక రాజమౌళి త్వరలోనే చరణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయవచ్చునని భావిస్తున్నారు.