టీవీ సీరియల్‌లో లీనమై వివాహిత మృతి

టీవీ సీరియల్‌లో లీనమై వివాహిత మృతి

ఇంటికి నిప్పు అంటుకున్నా టీవీ సీరియల్‌లో లీనమైన ఓ వివాహిత మంటల్లో చిక్కుకుని మృతి చెందిన ఘటన మదురైలో చోటుచేసుకుంది. కామరాజపురం భగత్‌సింగ్‌ వీధికి చెందిన రమేష్‌ భార్య మహాలక్ష్మి (41). కుటుంబ సమస్యల కారణంగా ఇద్దరు పిల్లలతో భర్త వేరుగా ఉంటున్నాడు. బంధువు ఇంటిలోని మిద్దెపై మహాలక్ష్మి అద్దె ఇంటిలో ఉంటోంది. మంగళవారం సాయంత్రం ఇంటిలో దీపం వెలిగించిన తరువాత టీవీ సీరియల్‌ చూడడానికి కింద ఇంటికి దిగి వచ్చింది. దీపం ఒరిగి ఇంటికి మంటలు అంటుకుంది. ఇది చూసిన ఇరుగుపొరుగు వారు మహాలక్ష్మికి తెలిపారు. దీంతో ఆమె దిగ్భ్రాంతి చెంది పైకి వెళ్లి మంటలు ఆర్పడానికి ప్రయత్నించడంతో మంటల్లో చిక్కుకుని మృతి చెందింది.