త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్న ఎన్‌టీఆర్

త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్న ఎన్‌టీఆర్

జూనియర్ ఎన్‌టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాపై ఎట్టకేలకు అధికారిక ప్రకటన వెలువడింది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న ఎన్‌టీఆర్ ఈ సినిమా తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో మరో సినిమాని చేయబోతున్నాడు. అయితే 2021 మే నెలలో ఈ సినిమా రిలీజ్ కానున్నట్టు సమాచారం.

అయితే ఎన్‌టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అరవింద సమేత మంచి సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో ఈ సినిమాపై కూడా ప్రేక్షకులలో భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ, నటుడు కళ్యాణ్‌రామ్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి “అయినను పోయిరావాలే హస్తినకు” అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే టైటిల్‌పై మాత్రం చిత్ర బృందం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.