వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అనంత అరటికి అరబ్ దేశాలలో గిరాకీ పెరగడమన్నది ఎంతో సంతోషకరమైన వార్త. ఈ అనంత రైతుల విజయానికి తెదేపా ఎన్నో ఏళ్ళుగా కృషిచేసింది. వాజ్ పేయి ప్రధానిగా ఉన్నకాలంలోనే నేను మైక్రోఇరిగేషన్ పై టాస్క్ ఫోర్స్ సభ్యునిగా నాటి తెదేపా పాలనలో సూక్ష్మసేద్యాన్ని పెద్దఎత్తున చేపట్టడం జరిగిందని అన్నారు.
అయితే ఇక గత ఐదేళ్ళ తెదేపా పాలనలో బిందు సేద్యం, తుంపర సేద్యాన్ని రైతాంగానికి చేరువ చేశాం. దేశాయి ఫ్రూట్స్ వెజిటబుల్స్ కంపెనీని 2018లో ప్రోత్సహించి దేశ, విదేశీ మార్కెట్ పెంచాం. ఫలితంగానే అనంతపురం నుంచి ప్రతి ఏటా ఎగుమతులు 12-15వేల మెట్రిక్ టన్నులకు పెరిగాయని, అనంత అరటికి అరబ్ దేశాల్లో గిరాకీ పెరిగినా, హార్టీకల్చర్ హబ్ గా రాయలసీమ అభివృద్ధి చెందినా అది తెదేపా హయాంలో జరిగిన అభివృద్ది వికేంద్రీకరణ ఫలితమే. దాన్ని వదిలేసి, అధికార వికేంద్రీకరణ పేరుతో ఈరోజు ప్రభుత్వం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి, అభివృద్దికి అడ్డంపడటం గర్హనీయమని అన్నారు.