దర్శికి మార్గదర్శి శిద్దా  అని కొనియాడిన సీఎం.  

Chandra Babu Naidu Praised Minister Sidda Raghava Rao

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

​ఐదవ విడత ‘జన్మభూమి – మా ఊరు’ కార్యక్రమాన్ని దర్శిలో  ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ 2018 ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగుని తీసుకురావాలని ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగను తలదన్నేలా దర్శిలో ‘జన్మభూమి – మా ఊరు’ కార్యక్రమ ప్రారంభ ఏర్పాట్లు ఉన్నాయని కొనియాడారు. కోలాటాలు, రంగేళి ముగ్గులు ఎక్కడ చూసినా తెలుగుదనం ఉట్టిపడేలా పండుగ వాతావరణం కనిపిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. 

దర్శి నియోజకవర్గం మంత్రి శిద్దా రాఘవరావు గారి నేతృత్వంలో ఎంతో అభివృద్ధి సాధించిందని అన్నారు. గతంలో ఏ ప్రజా ప్రతినిధి చేయలేని అభివృద్ధి ఆయన చేసి చూపించారని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, సంక్షేమమే ఈ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.కట్టు బట్టలతో, నెత్తిన అప్పులతో మన రాష్ట్రాన్ని విడగొట్టారని, అలాంటి పరిస్థితుల్లో కూడా నేడు ఇంత అభివృద్ధి సాధించడం ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానికే సాధ్యమని అన్నారు. 
ఈ కోలాహలం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని,  ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాని తెలిపారు. ఆడపడుచులు, చిన్నారులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని అన్నారు. జన్మభూమి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్న ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలియచేసారు. గతం కంటే భిన్నంగా ఈ ఐదవ విడత జన్మభూమి ఉంటుందని అన్నారు.
ప్రభుత్వ సంక్షేమ ఫలాలు రాష్ట్రంలో అర్హులందరికీ అందాలనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమాన్ని రూపొందించామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో  ప్రతి గ్రామంలో గ్రామసభ నిర్వహించి, రోజూ మధ్యాహ్నం రెండున్నర నుంచి ఒక్కో ప్రాధాన్యతాంశంపై గ్రామంలోని ముఖ్యులంతా చర్చించి తీర్మానిస్తారు. తెలియచేసారు. 
సంక్షేమం- సంతృప్తి, ఆరోగ్యం- ఆనందం, స్వచ్ఛాంధ్ర-ఓడీఎఫ్‌-ఓడీఎఫ్‌ ప్లస్‌-విలువలు, విద్య-వికాసం, మౌలిక సదుపాయాలు, సహజవనరులు-అభివృద్ధి, వ్యవసాయం-అనుబంధ రంగాల్లో అభివృద్ధి సుపరిపాలన- సాంకేతికత వినియోగం, విజన్‌ స్వర్ణాంధ్రప్రదేశ్‌-పేదరికంపై గెలుపు, ఆనందలహరి.. ఇలా పది అంశాలపై చర్చ ఉంటుందని తెలిపారు.