Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇన్నాళ్లుగా బీజేపీ అధిష్టానం తమను దూరంగా పెట్టి వైసీపీ ని దగ్గరకు చేరదీస్తున్న కారణం ఏమిటో ఏపీ సీఎం చంద్రబాబు పట్టేశారట. ఆ రహస్యం కనుక్కోవడమే కాదు మోడీ దగ్గర ఇక జగన్ కి డోర్లు ఓపెన్ కాకుండా కొత్త ప్లాన్ వేశారు. అది పూర్తి స్థాయిలో వర్కౌట్ అయితే జగన్ కి డోర్స్ క్లోజ్ కావడం తో పాటు చంద్రబాబుకి ఓపెన్ అవుతాయి. ఇంతకీ ఆ రహస్యం ఏమిటంటే.
ప్రధాని మోడీకి సన్నిహితుల్లో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఒకరు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ స్థాయిలో మోడీ దగ్గర ఆయన మాట చెల్లుతుందని చెప్పుకుంటారు. అలాంటి అదానీ తో వ్యాపార లావాదేవీల్లో భాగంగా వైసీపీ అధినేత జగన్ తో పరిచయం ఉందట. ఆ పరిచయమే తనను మోడీ దగ్గరకు పోనీయకుండా చేసిందని చంద్రబాబుకి తెలిసిందట. ఆ పరిచయం వల్లే జగన్ , విజయసాయి చాలా తేలిగ్గా ప్రధాని మోడీని కలవగలిగినట్టు కూడా చంద్రబాబు గుర్తించారట. ఆ లైన్ కట్ చేస్తే గానీ మోడీ దగ్గర జగన్ కి డోర్లు క్లోజ్ కావని అర్ధం చేసుకున్న చంద్రబాబు ఓ ప్లాన్ వేశారు. ముల్లుని ముల్లుతోనే తీయాలి అన్నట్టు వ్యాపార బంధాన్ని వ్యాపారంతో దెబ్బ కొట్టాలి అన్న సిద్ధాంతాన్ని ఫాలో అయిపోయారు. ఓ కాంట్రాక్టు తో ఆదానీని బుట్టలో వేసే ప్రయత్నం చేశారు.
శ్రీకాకుళం జిల్లా భావనపాడు పోర్ట్ అభివృద్ధి కాంట్రాక్టు లో అదానీ గ్రూప్ కూడా టెండర్ వేసింది. ఇక పోటీదారులుగా నవయుగ, గంగవరం పోర్ట్ కూడా రేసులో నిలిచాయి.అయితే ఆ రెండు సంస్థలు పోటీ నుంచి తప్పుకునేలా ఒప్పించి మరీ ఈ కాంట్రాక్టు అదానీ గ్రూప్ కి దక్కేలా చూశారట.దీనికి సంబంధించి క్యాబినెట్ లో చర్చ, నిర్ణయం చకచకా జరిగిపోయాయి. ఆస్ట్రేలియాలో బొగ్గు గనుల తవ్వకాల విషయంలో ఎదురు దెబ్బ తిన్న అదానీ గ్రూప్ భావనపాడు పోర్ట్ కోసం గట్టి పట్టు పట్టింది. నిజానికి బీజేపీ, టీడీపీ మధ్య ఇప్పుడు కొనసాగుతున్న రాజకీయ వాతావరణం రీత్యా చూస్తే అదానీ గ్రూప్ కి ఈ కాంట్రాక్టు దక్కే పరిస్థితి లేదు. అయితే సహనంతో ఇంకో ప్రయత్నం చేసి చూద్దాం అన్న బాబు ఆలోచనతో ఈ వ్యవహారం ముందుకు నడిచింది. అదానీ కూడా తాజా పరిణామంతో హ్యాపీ అట. అయితే ఆయన బాబు గారికోసం మోడీ దగ్గర తన పలుకుబడిని ఏ మేరకు ఉపయోగిస్తారు అన్నది చూడాలి . అంతా ఆయన అనుకున్నట్టు అయితే, అదానీ బాబుకి అనుకూలంగా ముందుకు వస్తే మోడీ దగ్గర జగన్ కి డోర్స్ క్లోజ్ అయినట్టే.