ఈ దురదృష్టకరమైన ఘటన జరగడం చాలా బాధాకరం : చంద్రబాబు

ఈ దురదృష్టకరమైన ఘటన జరగడం చాలా బాధాకరం : చంద్రబాబు

నేడు ఉదయం విశాఖ సమీపంలోని ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలో ఎల్‌జీ పాలీమర్స్‌ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకేజీ జరిగి, చాలా మంది తీవ్రమైన అస్వస్థతకు గురైన సంగతి మనకు తెలిసిందే. కాగా ఈ దారుణమైన దుర్ఘటన పై స్పందించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మాట్లాడుతూ… విశాఖ లో ఇంతటి దురదృష్టకరమైన ఘటన జరగడం చాలా బాధాకరమని, వెంటనే సహాయక చర్యలు వేంగవంతం చేయాలని, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని చంద్రబాబు నాయుడు సూచించారు.

అంతేకాకుండా ఈ ఘటన కారణంగా తీవ్ర సవస్థతకు గురైన వారందరికీ కూడా అత్యున్నత వైద్య సహాయం అందించాలని చంద్రబాబు కోరారు.ఇకపోతే అధికారులు, పోలీసులు అందరూ కూడా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రజలతో పాటే ముగ జీవాలను కూడా కాపాడాలని, అందరికి విజ్ఞప్తి చేసుకున్నారు. కాగా ఈ ఘటనలో ఇప్పటికే 8 మంది మరణించగా, 2000 మందికి పైగా అస్వస్థతకు గురయ్యి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు. మరణించిన వారిలో ముగ్గురు బాలికలు కూడా ఉన్నారు.