రాహుల్‌, బాబు భేటీ.. ‘ఎన్టీఆర్‌’పై ఎఫెక్ట్‌

Chandrababu And Rahul Meet, Effect On NTR Biopic

దేశ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతున్న రాహుల్‌ గాంధీ, చంద్రబాబు నాయుడు భేటీ సర్వత్రా ఆసక్తిని రేకెతిస్తున్న విషయం తెల్సిందే. దేశ వ్యాప్తంగా ఈ పొత్తు కొత్త రాజకీయాలకు తెర తీయడం ఖాయం అంటున్నారు. చంద్రబాబు నాయుడుతో కలయిక వల్ల కాంగ్రెస్‌ ఖచ్చితంగా బలపడబోతుందని, అదే జరిగితే మోడీ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయం అంటూ అంతా విశ్లేషిస్తున్నారు.

Modi

ఇలాంటి సమయంలో ‘ఎన్టీఆర్‌’ చిత్రానికి పెద్ద చిక్కు వచ్చి పడినది. ఎన్టీఆర్‌ చిత్రంను మొదటి నుండి కూడా చంద్రబాబు నాయుడు వెనుక ఉండి నడిపిస్తున్నాడు అంటూ అంతా అంటున్నారు. ఆయన కనుసన్నల్లోనే ఎన్టీఆర్‌ చిత్రం రూపొందుతుంది. ఎన్టీఆర్‌ తెలుగు దేశం పార్టీని ఎలా స్థాపించాడు, అందుకు దారి తీసిన పరిణామాలను ఎన్టీఆర్‌ చిత్రంలో చూపించాలని క్రిష్‌ భావించాడు. అందుకోసం కాంగ్రెస్‌ పార్టీన ఎన్టీఆర్‌ చిత్రంలో విలన్‌గా చూపించాల్సి ఉంది. కాని ఇప్పుడు టీడీపీతో కాంగ్రెస్‌ పొత్తు వల్ల ఎన్టీఆర్‌ చిత్రంలో అలా చూసించడం సాధ్యమేనా అంటూ సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

tdp and congress

ఎన్టీఆర్‌ చిత్రంలో ఆయన రాజకీయ జీవితాన్ని కీలకంగా చూపించబోతున్నారు. అది కూడా పార్టీ పెట్టినప్పటి నుండి సీఎంగా అయిన క్రమాన్ని చూపించేందుకు క్రిష్‌ ప్లాన్‌ చేశాడు. ఇలాంటి సమయంలో చంద్రబాబు వెళ్లి రాహుల్‌ గాంధీని కలవడంతో ఎన్టీఆర్‌ చిత్రంపై ప్రభావం పడే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు. ఎన్టీఆర్‌ చిత్రంలో కాంగ్రెస్‌పై విమర్శలు కాస్త తగ్గే అవకాశం ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇలాంటి రెండు నాల్కల దోరణి ఏమాత్రం సరి కాదని, బాలకృష్ణ కూడా భావిస్తున్నాడు. అందుకే కాంగ్రెస్‌ పై పెద్దగా విమర్శలు లేకుండా, ఎన్టీఆర్‌ పార్టీని ప్రారంభించడం వంటి సీన్స్‌ తోనే ఎన్టీఆర్‌ మహానాయకుడు సినిమా ఉంటుందని అనిపిస్తుంది. మొత్తానికి రాహుల్‌ తో చంద్రబాబు బేటీ కారణంగా ఎన్టీఆర్‌ సినిమాలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి.