Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బిల్ గేట్స్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ ముఖ్యంశాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు:
భారతదేశంలో వ్యవసాయం ఇప్పటికీ సంక్షోభంలో ఉంది.
ఉత్పాదకత తక్కువగా ఉండటం.
తరచు వరదలు రావడం, కరువును ఎదుర్కోవడం, వ్యవసాయోత్పుత్తులకు తగిన ధరలు లేకపోవడం ఈ రంగంలో ప్రధాన సమస్యలుగా ఉన్నాయి :
బిల్ గేట్స్ :
ఏపీలో ఎరువుల వినియోగం ఎలా ఉంది ?
ముఖ్యమంత్రి చంద్రబాబు:
వ్యవసాయం ఎక్కువగా ఎరువులపై ఆధారపడే పరిస్థితి ఉంది.
ఈ పరిస్థితిలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నాం.
ఎరువుల వాడకం బాగా తగ్గించడానికి కృషిచేస్తున్నాం.
గత ఏడాది మేము 15% ఎరువుల వాడకాన్ని తగ్గించగలిగాం.
భూ పరీక్షలు నిర్వహిస్తున్నాం.
సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం.
దేశంలో ఇది మొట్టమొదటి అగ్రిటెక్ సమావేశం.
అంతేకాదు, ఈ సమావేశం ఈ రంగంలో అభివృద్ధికి వేస్తున్న ఒక ముందడుగు.
గేట్స్ ఫౌండేషన్, AP ప్రభుత్వం కలిసి పనిచేసి ఒక నమూనాను రూపొందించాలి.
ఆహార భద్రత గురించి ఇవాళ ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు
రైతు భద్రత గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది.
రైతులకు సత్వరం రుణాలు అందించేలా చూస్తున్నాం.
ఉత్పాదకతను పెంచడం ద్వారా రైతాంగం నిలదొక్కుకునేలా చూడాలి.
సాంకేతికతను పరిచయం చేయడం ద్వారా
రైతాంగపు ఆదాయాన్ని పెంచాలి.
వ్యవసాయ రంగంలో ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాంకేతికత అంశాల గురించి అడిగి తెలుసుకున్న బిల్ గేట్స్ .
APలో తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ విధానాలపై బిల్ గేట్స్ ఆసక్తి.
ముఖ్యమంత్రి :
వ్యవసాయంతో పోషక విలువలు, పోషకాల ద్వారా ఆరోగ్యం, ఇదే మా వ్యవసాయం విధానం.
మా రాష్ట్రంలో పెద్ద ఎత్తున మహిళా స్వయం సహాయక సంస్థలు పనిచేస్తున్నాయి.
రైతు ఉత్పత్తిదారుల సంస్థలు తీసుకొచ్చాం.
గత ప్రభుత్వ హయాంలో దశాబ్దం పాటు వ్యవసాయరంగం సంక్షోభంలో చిక్కుకుంది.
రాష్ట్రంలో అన్ని సూచీలు పడిపోయాయి. మనం నెమ్మదిగా పునర్నిర్మాణం చేస్తున్నాం
నెమ్మదిగా విద్యుత్ లోటును అధిగమించాం. ప్రస్తుతం విద్యుత్ రంగంలో మిగులు సాధించే స్థితికి చేరాం.
రెండవతరం విద్యుత్ సంస్కరణలు తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం.
ఏపీలో వ్యవసాయం-గ్రామీణ ఆవిష్కరణలపై నాకు కొన్ని నిర్దిష్ట ప్రతిపాదనలు ఉన్నాయి.
దీనికి మీరు నాయకత్వం వహించండి.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదనపై బిల్ గేట్స్ సంతోషం.
మీ ప్రతిపాదన పట్ల ఉత్సుకతతో ఉన్నాను. దీనిపై పనిచేయడానికి ఎంత సమయాన్ని కేటాయించాలనే అంశంపై అంచనా వేసి చెబుతాను.
ఏపీలో ప్రతి ఏటా ఇలానే గ్లోబల్ అగ్రిటెక్ సదస్సులు నిర్వహించాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి అనుసంధానంగా నిలవాలి.
వ్యవసాయరంగంలో ప్రపంచానికే ఆలోచనల కేంద్రంగా నిలవాలి.
ముఖ్యమంత్రి చంద్రబాబు:
సంతోషం కొలమానంగా తీసుకున్నాం.
ప్రజా సంతృప్తిని ఒక సూచికగా భావించి దానికి అనుగుణంగా లక్ష్యాలు నిర్ణయించుకున్నాం.
ఆనంద సూచికలో భాగంగా ఆనందపు ఆదివారం వంటి కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహిస్తున్నాం. ప్రజలు సంతోషంగా ఉండటమే పరమార్ధంగా తీసుకున్నాం.
గేట్స్ ఫౌండేషన్ AP ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి.
వ్యవసాయం, ఆరోగ్యం, పోషక విలువలు, పారిశుధ్యం వంటి అంశాల్లో ప్రభుత్వానికి సహకరించాలి.
బిల్ గేట్స్ :
మేము మరుగుదొడ్ల అంశం మీద కొంత పరిశోధన చేస్తున్నాం.
మల విసర్జితాల నిర్మూలన ఒక ముఖ్య సమస్యగానే ఉంది.
టాయిలెట్ నిర్మాణంలో వినూత్న విధానాలు రావాలి.
రాబోయే ఐదు సంవత్సరాలలో ఈ విసర్జితాలను విచ్ఛిన్నం చేసే విషయంలో పురోగతి సాధిస్తాం.