Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నేడు యువనేత, ఏపీ మంత్రి లోకేష్ జన్మదినమని తెలుసు. ఆయన ఇక్కడ ఉంటే ఎలా ఉండేదో గానీ ప్రపంచ ఆర్ధిక సదస్సు కోసం దావోస్ వెళ్లడంతో పుట్టిన రోజు వేడుకల హడావిడి అంతగా కనిపించలేదు. అయితే సోషల్ మీడియాలో వచ్చిన ఒక్క ట్వీట్ ఈ మొత్తం లోటు తీర్చేసింది. కొడుకు తో పాటు తండ్రి కూడా పక్కనే ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారానే చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. అందులో ఆయన వాడిన మాటలు చూసి చంద్రబాబు పుత్రోత్సాహం గురించి చెప్పొచ్చు.
“తెలుగు యువతకు అసలైన ప్రతినిధి, ప్రజాకర్షక నేత నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు. ఆంధ్ర ప్రజలకు సేవ చేయడానికి మీకు గొప్ప బలం, సంకల్పం సిద్ధించాలని కోరుకుంటున్నా “ అని చంద్రబాబు చేసిన ట్వీట్ ఆసక్తి రేకెత్తిస్తోంది. లోకేష్ గురించి నాలుగు మంచి మాటలు చెప్పడానికి కూడా ఇబ్బందిపడే చంద్రబాబు ఇప్పుడు ఈ స్థాయిలో కొడుకు గురించి ట్వీట్ చేయడం రానున్న రాజకీయ పరిణామాలకు పెద్ద సంకేతం. వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టి రాష్ట్ర బాధ్యత కొడుకు చేతిలో పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.