Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎంతో ఆరోగ్యంగా దాదాపు 70 ఏళ్ళ వయసులోనూ నవ యువకుడిలా కష్టపడే చంద్రబాబు ఆరోగ్యంగా లేరా ?. ఔను కొన్ని సమస్యలు ఉన్నాయని సాక్షాత్తు చంద్రబాబు చెబుతున్నారు. ఆయన కుడి చేయి బాగా పని చేయడం లేదట. మరికొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ దావోస్ ఆర్ధిక సదస్సుకు వెళ్లి వచ్చిన చంద్రబాబు ఈరోజు ప్రెస్ మీట్ లో చాలా విషయాలు మాట్లాడారు. తన ఆరోగ్యం మొదలుకుని సూర్యారాధన దాకా, జగన్ వ్యూహాలు మొదలుకుని బీజేపీతో బంధం దాకా ఎన్నో విషయాలు మాట్లాడారు. ఆ బులెట్ పాయింట్స్ మీ కోసం.
-
ప్రకృతి ని ఆరాధించడం కోసం ఏరువాక, జలసిరికి హారతి, వనం-మనం కార్యక్రమం తరహాలో “సూర్య ఆరాధన” కార్యక్రమం..
-
రేపు రాష్ట్ర వ్యాప్తంగా సూర్య ఆరాధన కార్యక్రమం ప్రారంభిస్తున్నాం..
-
సూర్యుడు ని ఆదివారం అంటే ఇష్టం అందుకే ఆ రోజు సూర్య ఆరాధన కార్యక్రమం ప్రారంభిస్తున్నాం..
-
రేపు ఉదయం 7 గంటలకు విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియం లో సూర్య ఆరాధన కార్యక్రమంలో నేను పాల్గొంటా…
-
ప్రతి ఒక్కరు రేపు విధి గా సూర్య ఆరాధన కార్యక్రమంలో పాల్గొనాలి..
-
సూర్య ఆరాధన కి సంబంధించిన ప్రత్యేకంగా పాట ను రూపొందించిన ప్రభుత్వం..
-
అన్ని మతాల వారు, కులాల వారు సూర్యుడిని ఆరాధిస్తారు…
-
సమస్త జీవకోటిికి సూర్యుడు చాలా ముఖ్యం…
-
అందుకే ఆంధ్రప్రదేశ్ కి “సన్ రైజ్ స్టేట్” అని పేరు పెట్టుకున్నాం..
-
ప్రతి రోజు అర్ధగంట సేపు సూర్యడి ని ఆరాదించటం వలన చాలా లాభాలు ఉన్నాయి..
-
సూర్యుడు జస్టీస్ చక్రవర్తి టైపు అందరిని ఒకే న్యాయం..
-
సూర్యాడు శ్రామికుడు నిత్యం పనిచేస్తూనే ఉంటాడు..
-
సూర్యుడు మనకు చాలా ఉపయోగకరమైన పనులు చేస్తున్నాడు..
-
త్వరలో భూమి ఆరాధన కూడా చేపడతాం..
-
అందరూ భూమిని కూడా ఆరాధించాలి..
-
భూమి కూడా మనకు చాలా ఇస్తుంది..
-
అమరావతి రాజధాని ని కాలుష్య రహిత రాజధాని గా నిర్మిస్తున్నాం..
-
అమరావతి లో కార్బన్ డై ఆక్సైడ్ తగ్గించి, ఆక్సిజన్ శాతం పెంచడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం.
-
మొక్కలు పెంచడం తో పాటు ఎలక్ట్రికల్ వాహనాలు ఉపయోగిస్తాం
-
దావోస్ కు 1995 సంవత్సరం నుండే వెళ్ళుతున్నాను.
-
1995 నేను వెళ్ళే సమయంలో మన దేశం నుండి ఒక నాయకుడు కూడా వెళ్ళేవాడు కాదు..
-
ప్రపంచంలో ఉండే మేదావులు దావోస్ సదస్సులో పాల్గొంటున్నారు…
-
14సార్లు… దావోస్ ఎకానిమక్ ఫోరం లో పాల్గొన్నాను..
-
రాష్ర్టం విడిపోయిన తరువాత 4 సార్లు వెళ్ళాను..
-
20సంవత్సరాల తరువాత మన దేశం నుండి ఈ సదస్సులో దేశ ప్రధాని పాల్గొన్నడం విశేషం.
-
వ్యవసాయంకు సంబంధించి రెండు ఎమ్.ఓ.యు లు చేసుకున్నాం…
-
జ్యూరిక్ లో సిస్టర్ సిటితో ఒక్క ఎమ్.ఓ.యు చేసుకున్నాం..
-
రియల్ టైమ్ గవర్నన్స్ లో దేశంలో మొదటి స్తానంలో ఉన్నాం..
-
త్వరలో అన్ని శాఖలో ఈ-పేపర్ విధానం తేస్తాం..
-
త్వరలో ఓ నూతన టెక్నాలజిని తీసుకొని రాబోతున్నాం
-
ఈ టెక్నాలజీతో ప్రతి శాఖ పనితీరుతో పాటు సమస్యలు పరిష్కారం సులభతరం చేయనున్నాం.
-
శ్రీకాకుళం నుండి కర్నూలు వరకు ఇనవేషన్ వ్యాలీ ఏర్పాటు చేయనున్నాం.
-
విశాఖ లో 1000 నుండి 2000 ఎకరాల్లో మరో మేటెక్ జోన్ ఏర్పాటు చేయబోతున్నాం..
-
దావోస్ లో అందరి చూపు భారత దేశం, ఆంద్రప్రదేశ్ వైపే..
-
భారతదేశంలో ఉన్న అవకాశాలు ఏదేశం లేవని ప్రపంచమే ఒప్పుకుంది.
-
నాకు అనారోగ్యంగా వున్నప్పటికీ దావోస్ పర్యటనకు వెళ్ళాను. నా కుడి చేయి సరిగా పనిచేయడం లేదు.
-
ఇప్పటివరకూ పదిసార్లు ఫిజియోదెరపీ చేయించుకున్నాను…
-
తీవ్ర అస్వస్తతతో నన్ను డాక్టర్లు దావోస్ వెళ్ళొద్దని చెప్పినా వినకుండా వెళ్ళాను.
-
దావోస్ లో నా ఆరోగ్యం బావుండక నిద్రకూడా లేదు…
-
ఇదంతా ప్రజల కోసం చేస్తున్నాను…
-
అయినా నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు .
-
జగన్ ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో కలిసి పని చేస్తానని కొత్తగా అనడం లేదు.
-
జగన్ ఏ మాట మీదా నిలబడడు…
-
ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో రాజీమా చేయిస్తా అన్నాడు. కానీ చేయలేదు…
-
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇచ్చినపుడు ప్రత్యేక హోదా జగన్ కు గుర్తుకు రాలేదా.
-
కేసులనుంచి బయట పడటానికి అక్రమ ఆస్తులు కాపాడుకోవడటానికి జగన్ చేసే ప్రయత్నాల్లో ఇదొకటి…
-
అవినీతి పరుల ఆస్తులన్నీ ఇకపై ప్రజలకు చెందలి.
-
బీహార్, ఒరిస్సా తరహాలో అవినీతి ఆరోపణలతో దోచుకున్న సొమ్మంతా వెనక్కు తీసుకుంటాము.
-
అగ్రిగోల్డ్ బాదితులకు డబ్బులు తిరిగి ఇప్పిస్తున్నాము…
-
బీజేపీ నేతలు మా పార్టీ మీద చేసిన ఆరోపణల పై ఆ పార్టీ అధిష్టానం చూసుకుంటుంది.
-
నేను కూడా మా పార్టీ నేతలు బీజేపీ పై ఎలాంటి ఆరోపణలు చేయకుండా నియంత్రిస్తున్నాను…
-
మిగిలిన రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందే వరకూ ఆదుకోవాలి..
-
గవర్నర్ లాంటి గౌరవపదమైన వ్యక్తులకు సంబందించి నేను బహిరంగ వ్యాఖ్యలు చేయలేను…
-
నేను హుందాగా వుంటాను, గవర్నర్ ని మార్చాలని కొంతమంది చేస్తున్న కామెంట్ల పై నేను స్పందించలేను…