పవన్ కి చంద్రబాబు పంచ్…

chandrababu comments on pawan kalyan over polavaram project

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న పవన్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు.

శ్వేతపత్రానికి ఏమైనా బంగారం పూత వేస్తారా అంటూ చురకలంటించారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

రూపాయి అవినీతి లేకుండా పోలవరం పనులు జరుగుతున్నాయని అన్నారు.

పోలవరం పనుల పురోగతిపై అసెంబ్లీలో సహా, బయటా వివరాలు వెల్లడిస్తూనే ఉన్నామని వివరించారు. రోజు రోజు పనుల్లో పురోగతి వస్తూనే ఉందని… దానికనుగుణంగా ఎప్పటి కప్పుడు వివరాలను అందుబాటులో పెడుతున్నామని వెల్లడించారు.

పోలవరం పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ జనసేన అధినేత పవన్… ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.