Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుటుంబం ఉండవల్లి ఓటర్లుగా నమోదయింది. విభజన తర్వాత కొన్నాళ్లు హైదరాబాద్ కేంద్రంగానే పాలన సాగించిన ముఖ్యమంత్రి ఓటుకు నోటు కేసు తర్వాత ఆంధ్రప్రదేశ్ కు నివాసం మార్చుకున్నారు. ఉండవల్లి కరకట్టపై ఉన్న భవనంలో ముఖ్యమంత్రి నివిసిస్తున్నారు. అక్కడినుంచే పాలన సాగిస్తున్నారు. తాడేపల్లి మండలం ఉండవల్లితో తమను ఓటర్లుగా చేర్చాలని చంద్రబాబు కుటుంబం దరఖాస్తు చేసుకుంది. దీంతో సీఎంతో పాటు ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి పేర్లను అధికారులు ఉండవల్లి ఓటర్ల జాబితాలో చేర్చారు. ఇంటినెంబర్ 3-7811లో వారు ఉంటున్నట్టు నమోదుచేశారు. సీఎం ఫ్యామిలీ తమ గ్రామంలో ఓటర్లుగా మారడంపై ఉండవల్లి వాసులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.