SC వర్గీకరణ మాట నిలబెట్టుకున్నాం…

Election Updates: Chandrababu will visit Kuppam for the second day today..
Election Updates: Chandrababu will visit Kuppam for the second day today..

ఎస్సీ వర్గీకరణపై ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గురువారం జరిగిన శాసనసభ చర్చలో ఆయన మాట్లాడారు. ఎస్సీ ఉపకులాల్లో సమన్యాయం కోసం సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తున్నామని తెలిపారు. 1995లో తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో మొదలై, ఇప్పటివరకు సాగిన వర్గీకరణ అంశం… తన హయాంలోనే సాకారం కావడం సంతృప్తినిచ్చిందన్నారు. 2026 జనగణన తర్వాత జిల్లా యూనిట్‌గా అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని వివరించారు.