పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చంద్రబాబు అరెస్టుపై స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ అనేది ఒక రాష్ట్రానికి పరిమితమైనది కాదని… చంద్రబాబు ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదని వెల్లడించారు. చంద్రబాబు జాతీయ స్థాయిలో ప్రభావం చూపించిన వ్యక్తి అంటూ కొనియాడారు.
అటువంటి వ్యక్తి అరెస్ట్ గురించి నిరసనలు తెలిపితే అందుకు అనుమతి ఇవ్వాలి కానీ అడ్డుకుంటే ఎలా? ఆంధ్ర ప్రాంతానికి చెందిన కమ్మ వారి ఓట్లు కావాలి కానీ వారికి నిరసనలు తెలిపే హక్కు లేదా ? అంటూ మంత్రి కేటీఆర్‌కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చురకలు అంటించారు.
చంద్రబాబు అరెస్ట్ తెలంగాణకు సంబంధం లేదు అనుకుంటే తెలంగాణ ఉద్యమం సమయంలో అమెరికాలో వైట్ హౌజ్ ముందు ఎందుకు నిరసనలు తెలిపారు ? అని మండిపడ్డారు. నిరసన తెలిపే వారిని అడ్డుకుంటే వారు ఈసారి బీఆర్ఎస్ పార్టీ చెంపలు వాయిస్తారని హెచ్చరించారు. ఈసారి ఎన్నికల్లో ఆంధ్ర సెటిలర్స్ బీఆర్ఎస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెడతారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.