Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
“ఎప్పుడొచ్చాము అని కాదన్నయ్యా బులెట్ దిగిందా లేదా “ అని పోకిరిలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో వేరే చెప్పనవసరం లేదు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే చేస్తున్నాడు. బీజేపీ తో చేయిస్తున్నాడు. ఏపీ కి ప్రత్యేక హోదా తెస్తున్నాడు. మిత్రపక్షంగా ఉండి ఎంత బతిమిలాడినా ప్రత్యేక హోదాకి నో చెప్పిన బీజేపీ మెడ వంచడానికి చంద్రబాబు వేసిన ప్లాన్ సూపర్ సక్సెస్ కాబోతోంది. చంద్రబాబు ఎప్పుడైతే బీజేపీ కి గుడ్ బై కొట్టి nda నుంచి బయటకు వచ్చాడో అప్పుడే కమలనాధులు ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వడానికి డిసైడ్ అయిపోయారు. కాకపోతే ఆ క్రెడిట్ చంద్రబాబుకి రాకుండా పవన్ లేదా జగన్ కి కట్టబెట్టి వాళ్ళ వెనుక ఉండి రాజకీయం నడిపించాలని చూస్తున్నారు.
“2019 ఎన్నికలకు కొన్ని నెలల ముందు హఠాత్తుగా ఏపీ లో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. ప్రత్యేక హోదా పోరు పతాక స్థాయికి చేరుకుంటుంది. పవన్ కళ్యాణ్ హోదా డిమాండ్ తో ఆమరణ దీక్ష చేస్తాడు. రాష్ట్రం రగిలిపోతుంది. ఆ వేడిలో దిగొచ్చిన బీజేపీ రాష్ట్రానికి హోదా ప్రకటిస్తుంది. దీంతో పవన్, మోడీ ని ఆకాశానికి ఎత్తుతాడు. మోడీ కూడా పవన్ ని గొప్ప నాయకుడు అని పొగుడుతాడు. ఆ ఇద్దరితో సీఎం కుర్చీ కోసం కాచుకు కూర్చున్న జగన్ జత కలుస్తాడు. వీళ్లంతా కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తారు. “…ఇదీ ప్రస్తుతానికి ప్రధాని మోడీ, అమిత్ షా ద్వయం వేసుకున్న ప్లాన్. అయితే రాజకీయాల్లో వ్యూహాలకి ప్రతి వ్యూహాలు వుంటాయని, పైగా ఎదురుగా వున్నది చాణుక్యుడు లాంటి చంద్రబాబు అని వారికి అర్ధం కావడం లేదు. 2014 ముందు కూడా కాంగ్రెస్ ఇలా లాలూచీ రాజకీయాలు చేసి తెలంగాణాలో తెరాస ని తక్కువ అంచనా వేసి ఏమి ఫలితం అనుభవిస్తుందో చూసాం. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. బాబు శత్రుశిబిరంలో చేరి మరీ బీజేపీ తో హోదా ఇప్పిస్తాడు. ఆపై 2019 ఎన్నికల్లో గెలుస్తాడు. ఇదంతా చూస్తే ప్లాన్ వేసుకుంది బీజేపీ కానీ అది లభించేది చంద్రబాబుకే అని వేరే చెప్పక్కర్లేదు.