కొద్ది రోజుల క్రితం జరిగిన తెలంగాణా ఎన్నికల్లో తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి కూటమి కట్టి కొన్ని చిన్నా చితకా పత్య్లను కూడా కలుపుకున్న సంగతి తెల్సిందే. ఈ నేపధ్యంలో రానున్న ఎన్నికల్లో ఏపీలో కూడా కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి పోటీ చేస్తాయని ప్రచరం జరిగింది. దీనికి ఊతం ఇచ్చేలా ఏపీపీసిసి అధ్యక్ష్యుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ నేపధ్యంలో ఎపెలో రెండు పార్టీల పొత్తు ఖాయం అని అందరూ భావించారు. కనీ ఆంధ్రప్రదేశ్ లో ఏమి రాజకీయ వ్యూహం అమలు చేయాలో టీడీపీ అధినేత చంద్రబాబు ఓ క్లారిటీకి వచ్చినట్లు కనిపిస్తోంది. ఢిల్లీకి వెళ్లి నాలుగుగంటల పాట్ రాహుల్ గాంధీతో భేటీ జరిపిన ఆయన సీట్ల సర్దుబాటు గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే పొత్తులు ఉంటాయని కాంగ్రెస్‌తోనూ ఇందుకు అనుగుణంగానే వ్యవహరిస్తామని ప్రకటించారు. రాష్ట్ర స్థాయిలో పొత్తులు లేకపోయినా జాతీయస్థాయిలో కలిసొచ్చే అంశాలు పరిశీలించాలని వ్యాఖ్యానించారు. అంటే ఆయన రాహుల్‌గాంధీతో ఏపీలోని పరిస్థితుల్ని వివరించి సీట్ల సర్దుబాటు సాధ్యం కాదని జాతీయ స్థాయిలో మాత్రం మద్దతుగా ఉంటామని చెప్పినట్లు రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. టీడీపీతో పొత్తుపై కాంగ్రెస్ పార్టీలో మిగిలి ఉన్న నేతలు ఆశలు పెట్టుకున్నారు.
ఈ మేరకు జిల్లాల వారీగా తిరిగి రఘువీరారెడ్డి ఓ లిస్ట్ కూడా రెడీ చేసుకున్నారు. దాన్ని తీసుకెళ్లి రాహుల్ గాంధీకి ఇచ్చారు. పొత్తుల సంగతి త్వరగా తేల్చాలని కోరారు. అయితే తెలంగాణ ఎన్నికల్లో భారీ ఎదురు దెబ్బ తగలడంతో చంద్రబాబు సీట్ల సర్దుబాటు విషయంలో ఆలోచిస్తున్నారు. రాహుల్ కు ఏపీలో పొట్టు వద్దని చెప్పి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ నేతలకు.. పరోక్షంగా తెలియజేస్తున్నారు. బీజేపీయేతర కూటమి పక్షాలకు ఈ నెల 19వ తేదీ కీలకం. ఆ రోజున మమతా బెనర్జీ కోల్‌కతాలో బీజేపీకి వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో మమతా బెనర్జీని దెబ్బకొట్టడానికి ఆమె పార్టీకి చెందిన ఎంపీలను బీజేపీలో చేర్చుకునేందుకు అమిత్ షా రెడీ అయ్యారు. ఇప్పటికే ఒకర్ని చేర్చుకున్నారు. మరో ఐదుగురు వస్తారంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంలో మమతా బెనర్జీ ర్యాలీలో విపక్షాల ఐక్యతను చాటాలనుకుంటున్నారు. కానీ ఆమె కాంగ్రెస్‌తో దూరంగా ఉంటున్నారు. ఈ సందర్భంగా వీలైనన్ని ఎక్కువ విపక్ష పార్టీలను కోల్‌కతా ర్యాలీకి హాజరయ్యేలా చూసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఆ ర్యాలీ హిట్ అయితేనే జాతీయ స్తఃయిలో కాంగ్రెస్‌తో పొత్తు గురించి ప్రకటించే అవకాశం ఉంది.