Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రధాని నరేంద్ర మోడీ, ఇవంకా ట్రంప్ సమక్షంలో హైదరాబాద్ లో జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు లేకపోవడం మీద సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది. ఈ సమావేశానికి చంద్రబాబుకు పిలుపు లేదు. దీనికి ఎవరైనా తప్పు పట్ట దలుచుకుంటే సదస్సు నిర్వహించిన కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టాలి. ఇక మెట్రో విషయానికి వచ్చేసరికి ప్రధానిని పిలిచి పక్క రాష్ట్రపు ముఖ్యమంత్రిని వదిలేసింది కెసిఆర్.
అమరావతి శంకుస్థాపన సమయంలో ఇలాంటివేమీ పట్టించుకోకుండా కెసిఆర్ ని పిలిచి గౌరవం ఇచ్చారు చంద్రబాబు . ఇప్పుడు కెసిఆర్ ఆ పద్ధతి పాటించలేదు అంతే . కానీ కొందరు సోషల్ మీడియాలో మోడీ , కెసిఆర్ ని వదిలేసి చంద్రబాబు మీదే రంకెలు వేస్తున్నారు. ఎక్కడైనా పెళ్ళికి పిలవకపోతే తప్పు పడతారా లేక పిలిపించుకునే అర్హత లేదని తప్పుబడతారా ? ఏ మాత్రం కామన్ సెన్స్ వున్న వారికి అయినా ఈ విషయం అర్ధం అవుతుంది.
ఆ కామన్ సెన్స్ కి దూరం అయ్యింది కొందరు సోషల్ మీడియాలోని మిత్రులే కాదు కొన్ని ప్రముఖ ఛానెల్స్ కూడా ఇదే వైఖరితో మాట్లాడాయి. హైదరాబాద్ కు ఇవంకా వచ్చినందుకు, అమరావతి రానందుకు బాబు ఏదో తప్పు చేసినట్టు బిల్డ్ అప్ ఇస్తున్నారు. ఇక్కడా అంతే కామన్ సెన్స్ మిస్. అతిధిని పిలవడం వరకే మన పని. రావడం, రాకపోవడం తనిష్టం. ఈ మాత్రం కూడా తెలుసుకోకుండా ఓ యాంకర్ మహానుభావుడు చంద్రబాబు కు జెలసి అంటగట్టే ప్రయత్నం చేసాడు. ఇదంతా చూస్తుంటే టీవీల్లో జరుగుతోంది చర్చా లేక పెద్ద కామెడీ షో నా అని అనిపించింది.
ఈ మధ్య బిల్ గేట్స్ వైజాగ్ వచ్చి వెళ్ళాడు. అది చంద్రబాబు ఘనత అవుతుందేమో గానీ కెసిఆర్ వైఫల్యం అవుతుందా ? ఈ మాత్రం తెలియకుండా వ్యవహరించేవాళ్ళని తప్పుబట్టడం కూడా అనవసరం. కాలం అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. కాలంతో పాటు అన్ని ముసుగులు తొలిగిపోతాయి.