Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆ లాంఛనం కూడా పూర్తి అయ్యింది. టీడీపీ, బీజేపీ ల మధ్య బంధం లో తొలి ముడి తొలిగిపోయింది. కేంద్ర మంత్రి వర్గం నుంచి టీడీపీ, రాష్ట్ర మంత్రి వర్గం నుంచి బీజేపీ తప్పుకున్నాయి. ఇక ఈ తెగదెంపులు వ్యవహారాన్ని nda దాకా తీసుకెళ్లడం ఎలా జరుగుతుంది అన్నదే ఆసక్తికరం. మంత్రివర్గం నుంచి బయటకు రావడం తో పాటే nda నుంచి చంద్రబాబు దూరం జరుగుతారని బీజేపీ భావించింది. అక్కడే చంద్రబాబు జాగ్రత్తపడ్డారు. బీజేపీ మీద అసంతృప్తితో రగిలిపోతున్న మిగిలిన nda పక్షాలను కూడా ఏకం చేయడానికి ఆయన ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం టీడీపీ మంత్రులు కేంద్రమంత్రివర్గం నుంచి వైదొలిగాక nda కన్వీనర్ హోదాలో చంద్రబాబు ఓ సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఢిల్లీ వేదికగా జరిగే ఈ భేటీకి బీజేపీ వచ్చే ఛాన్స్ ఎంత ?. కూటమిలో పెద్ద పార్టీ గా ఆ సమావేశానికి రాకపోతే జరిగే నష్టం ఏమిటో ఆ పార్టీకి తెలుసు. ఒకవేళ వస్తే ఆ సమావేశంలో కూటమిలోని పార్టీలన్నీ తమను టార్గెట్ చేస్తాయని బీజేపీ కి తెలుసు. ఆ విధంగా రెండు విధాలుగా బీజేపీ కి అగ్నిపరీక్షే. ఇక nda లోని మోడీ వ్యతిరేక పార్టీలను కూడా తమతో పాటు బయటికి తీసుకు వచ్చేందుకు కూడా చంద్రబాబు వ్యూహం రచిస్తున్నారు. Nda ని విచ్చిన్నం చేస్తే బీజేపీ డిఫెన్స్ లో పడుతుందని బాబు ఆలోచన. టీడీపీ తో పాటు nda కి గుడ్ బై కొట్టాలని యోచిస్తున్న పార్టీలు ఏమిటో ఒకటిరెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందట.