Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని అందరినీ మోసం చేశారని చంద్రబాబు ఆరోపించారు. ప్రధాని మాటలకు తానూ మోసపోయానని ఆయన అన్నారు. ప్రధాని మాటలు కోటలు దాటుతున్నాయని అన్నారు అలాగే అనుభవంలేని వాళ్ళు నేనే పాలిస్తా అంటూ రోడ్డు ఎక్కారని పవన్, జగన్ లను ఉద్దేశించి చంద్రబాబు విమర్శించారు. అలాగే ఏటీఎంలలో డబ్బులులేని పాలన దేశంలో సాగుతోందని వ్యాఖ్యానించారు. మన డబ్బులు మనం తీసుకోవాలంటే క్యూలో నిలబడేలా చేశారని చంద్రబాబు అన్నారు.
ఇడ్లీపై కూడా 18శాతం టాక్స్ వేయడం దారుణమని అన్నారు. ప్రధానమంత్రి మైక్ తీసుకుంటే… ఎవరూ ఆయనను ఆపలేరని, ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు ఇస్తారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ‘చంద్రన్న బీమా పథకం మూడేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. సంఘటిత కార్మికుల కుటుంబాల కష్టాలే తనను ఈ పథకం పెట్టేలా చేశాయని అన్నారు. ఈ పథకం సక్రమంగా అమలు చేయడానికి డ్వాక్రా సంఘాలు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు.