Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కొత్త ఏడాది రాబోతోంది. 2018 లోకి వస్తుండగానే అన్ని పార్టీల్లో 2019 ఎన్నికలకు సంబంధించిన వేడి మొదలైంది.టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎన్నికల పనిలో పడ్డారు. అయితే ఎన్నికల కోసం అనుసరించే వ్యూహాన్ని ఖరారు చేసేముందు ఎమ్మెల్యేలు ,మంత్రులతో పాటు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారుల పనితీరు మీద ఓ నివేదిక తయారు చేయబోతున్నారు. అయితే ఈ నివేదిక ఎవరి ఫీడ్ బ్యాక్ ఆధారంగా నిర్ణయిస్తారో తెలుసా ? టీడీపీ కార్యకర్తలు వాళ్ళ భవిష్యత్ ని నిర్ణయించబోతున్నారు. ఇందుకోసం స్వయంగా సీఎం చంద్రబాబు టీడీపీ కార్యకర్తలతో నేరుగా టెలి కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. అయితే కార్యకర్తలు తమ మనసులో మాట ఏ భయం లేకుండా చెప్పేందుకు వీలుగా ఈ టెలి కాన్ఫరెన్స్ కి ఎమ్మెల్యేలు ,మంత్రుల్ని దూరంగా వుంచబోతున్నారు. ఎన్నికల ఏడాదిలో ఈ తరహాలో కార్యకర్తలతో ఎక్కువ సార్లు మమేకం అయ్యేలా చంద్రబాబు ఇంకొన్ని కార్యక్రమాలు కూడా రూపొందిస్తున్నారు.
టీడీపీ ఆఫీస్ నుంచి ఈ టెలి కాన్ఫరెన్స్ కి సంబంధించిన సందేశం అందగానే కార్యకర్తల్లో హుషారు వచ్చింది పార్టీ కోసం తాము ఎంత కష్టపడుతున్నా లెక్క చేయని ఎమ్మెల్యేలు , మంత్రుల గురించి హైకమాండ్ కి నేరుగా విషయం చెప్పొచ్చన్న ధీమా వారి మాటల్లో కనిపిస్తోంది. ఇక తమ కనుసన్నల్లో మెలిగే కార్యకర్తల మనస్సులో ఏముందో , వాళ్ళు అధిష్టానానికి ఏమి చెబుతారో అన్న భయం ఎమ్మెల్యేలు ,మంత్రుల్లో కనిపిస్తోంది.