విదేశాల నుంచి వచ్చేసిన చంద్రబాబు టీడీపీ నేతలతో సమావేశం అయ్యారు. గతంలో కంటే ఈ సారి ఓటింగ్ శాతం పెరగడంతో వైసీపీకి ఓటమి భయం పుట్టుకుందన్నాడు . పోలింగ్ సరళి చూస్తే వైసీపీకి 35 సీట్లు కూడా వచ్చే పరిస్థితి అసలు కనిపించడం లేదన్నారు. ఓటమి భయంతో కౌంటింగ్ రోజు అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ఈసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తున్నట్లు చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
ఇక అటు ఏపీలో జగన్ మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని వేణుస్వామి కూడా స్పష్టం చేశారు. రాష్ట్రంలో 79 సీట్లల్లో వైసీపీ వన్ సైడ్‌గా గెలుస్తుందని .. 30 నుంచి 40 సీట్లల్లో టఫ్ ఫైట్ ఉంటుందని వేణుస్వామి తెలియచేసారు . 95-125 సీట్ల వరకు YCP విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. అంతే కాకుండా 2029 ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సృష్టిస్తారని ఆయన వ్యాఖ్యానించారు.