పెన్షన్ల పంపిణీపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాశారు. మే 1న ఇంటింటికీ పెన్షన్లు ఇచ్చేలా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన వారిని కోరారు. గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా చూడాలని, గ్రామస్థాయి ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దే పెన్షన్లు ఇవ్వాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఇంటింటికీ వెళ్లి పెన్షన్ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు .
ఇదిలా ఉంటే… సీఎం జగన్ నాటకాల రాయుడు అని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలను చేశారు.’2014, 2019 ఎన్నికల్లో జగన్ శవరాజకీయాలతో నెట్టుకొచ్చారు . ఈసారి మరొక డ్రామాతో ముందుకి వచ్చాడు. కనపడని ఒక గులకరాయి తగిలింది అని ఒక బ్యాండ్ వేశాడు. రోజురోజుకూ ఆ బ్యాండ్ పెద్దదవుతుంది అని మండిపడ్డారు. మే 13 ఎన్నికల రోజు వరకు డ్రామా ఆడిస్తానే ఉంటారు . ఈ నాటకాల రాయుడు’ అని చెప్పుకొచ్చారు .