Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషల సినిమా పరిశ్రమలో కూడా వారసులు ఉండటం అనేది చాలా సహజం. ఇప్పుడు సినిమా పరిశ్రమలోనే కాకుండా రాజకీయాల్లో, వ్యాపారాల్లో ఇలా అన్ని రంగాల్లో కూడా వారసత్వం అనేది ఇండియాలో ఎక్కువగా కనిపిస్తూ వస్తుంది. అది సినిమా పరిశ్రమలో మరీ ఎక్కువ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో ఒక్కరు ఇద్దరు తప్ప అంతా కూడా వారస్సులు అని చెప్పుకోక తప్పదు. ఆ వారసులకు మళ్లీ వారసులు వస్తున్నారు. ఇలా ఇండస్ట్రీ మొత్తం వారసులతో నిండి పోతుంది. కొత్త వారికి అవకాశాలు వచ్చే పరిస్థితి లేదు. ఒక్కరు ఇద్దరు ట్యాలెంట్‌తో పైకి వచ్చే ప్రయత్నం చేసినా కూడా సక్సెస్ అవ్వడం లేదు. హీరోలుగా కొత్త వారికి భవిష్యత్తులో మరింత కఠిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది.
ఇలాంటి సమయంలో సీనియర్ నటుడు చంద్రమోహన్ సినిమా పరిశ్రమలో వారసత్వం గురించి సంచల వ్యాఖ్యలు చేశాడు. ఆయన వారసత్వంను ఎంత మాత్రం ప్రోత్సహించవద్దు అంటూ సినిమా పరిశ్రమ వారిని కోరుతున్నాడు. వారసత్వం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో సినిమా పరిశ్రమ మనుగడే ప్రమాదంలో పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. దాంతో పాటు కొత్తగా వచ్చిన వారిని ఎదగనివ్వ కుండా కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆరోపించాడు.
ప్రస్తుత దర్శకులు రికమండేషన్‌తో వస్తున్న వారు ఎక్కువగా ఉన్నారు. వారి కథ మరియు కథనం ఏమాత్రం బాగోలేకున్నా కూడా ఏదో ఒక అంశం హైలైట్ అవ్వడంతో సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. ఇక ఇతర భాషల నుండి ఎక్కువగా నటీనటులను తీసుకు రావడం వల్ల కూడా తెలుగు సినిమా పరిశ్రమ నాశనంకు దారి తీస్తుందని చంద్రమోహన్ ఆవేదన వ్యక్తం చేశాడు. చంద్రమోహన్ ఆవేదనలో అర్థం ఉందని, ఆయన చెప్పిన విషయం ఆలోచించదగ్గది. మరి సినిమా పరిశ్రమ పెద్దలు చంద్రమోహన్ మాటలను చెవిన పెడతారా లేదా అనేది చూడాలి.